Website with Designing 399/- Rs Only. Media5 Contact 95050 71110

ఒకసారి స్వామి రాంతీర్థ జపాన్‌లో పర్యటిస్తూ అందులో భాగంగా రైలులో ఒక ఊరి నుండి మరో ఊరికి ప్రయాణిస్తున్నాడు.స్వామికి మధ్యలో ఆకలి అయ్యి పండ్ల కోసం ఒక స్టేషన్‌లో దిగి పండ్ల కోసం వెదికాడు.కాని ఎక్కడా దొరకలేదు. అలానే రైలు ఆగిన మరో మూడు స్టేషనులలో ప్రయత్నించాడు కానీ దొరకలేదు.ఇదంతా గమనిస్తోన్న ఎదుటి సీట్‌లో కూర్చొని ఉన్న ఒక జపాన్ కార్మికుడు రైలు మరో స్టేషనులో ఆగుతుందనగా రైలు ఆగీఆగకనే దిగివేసి బయటకు పరుగెత్తుకు వెళ్ళి పండ్లు కొనుక్కొనివచ్చి రామతీర్థ గారికి ఇచ్చాడు.రామతీర్థ గారు “ఎందుకంత కష్టం తీసుకొన్నావు?” అంటూ డబ్బు అతని చేతికి ఇవ్వబోగా అతను తీసుకోవడానికి నిరాకరిస్తూ ఒక్క మాట మాత్రం అన్నాడు.”స్వామీ! మీరు జపాన్ నుండి భారతదేశమునకు తిరిగవెళ్ళిన తర్వాత అక్కడ మీరు జపాన్ లో కనీసం తినడానికి కూడా పండ్లు దొరకలేదని అనకండి.అందుకే నేనిలా చేసాను.అదే మీరు నాకు ఇచ్చే పదివేలు” అన్నాడు.